హైదరాబాద్: పార్టీ పరంగా నిర్ణయం తీసుకునే వరకు పార్టీలో ఎవరూ పులిచింతల ప్రాజెక్టుపై నోరు మెదపకూడదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు హెచ్చరించారు. కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శాసనసభ్యుల్లో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో ఈ హెచ్చరిక చేశారు. పులిచింతలపై పార్టీలో చర్చించలేదని, నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుపై తాము ఒక కమిటీ వేస్తామని, ఈ కమిటీ నివేదకఅందిన తర్వాత చర్చించి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

పులిచింతల ప్రాజెక్టుకు అనుకూలంగా కృష్ణా జిల్లా శాసనసభ్యుడు బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో పిసిసి అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావును కలిశారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేస్తే తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ ఉపయోగకరంగా వుంటుందని బుద్ధప్రసాద్ అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోనిడెల్టా ప్రాంతానికి సకాలంలో నీరందలేదని, దీంతో రైతులు సకాలంలో పంట వేయలేకపోయారని ఆయన అన్నారు. ఒక వేళ పులిచింతల వుండి వుంటే నీరు నిల్వ చేసి సకాలంలో నీరు విడుదలచేయడానికి వీలయ్యేదని, దాని వల్ల సకాలంలోడెల్టా రైతులు సకాలంలో పంటలు వేసుకుని వుండేవారని ఆయన అన్నారు.
పులిచింతలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఇటీవల కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రకటన విభేదాలకు ఆజ్యం పోసింది. రాజశేఖర్ రెడ్డి ప్రకటనను వ్యతిరేకిస్తూ నల్లగొండ జిల్లా శాసనసభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పత్రికలకు ఎక్కారు. దీనికి చాలా రోజుల ముందు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులు పులిచింతల ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు.

Click it and Unblock the Notifications