హైదరాబాద్‌ః అధికార వికేంద్రీకరణలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల ఏర్పాటు విజయవంతం కావాలంటే అందుకు కలెక్టర్లే చొరవచూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. జిల్లా కలెక్టర్లు మూడు రోజుల సమావేశాన్ని ఆయన బుధవారం నాడు ప్రారంభించారు.
కలెక్టర్లు కార్యాలయాలేక పరిమితం కాకుండా గ్రామాల్లో పర్యటించాలని ఆయన సూచించారు. ఫీల్డ్ ఆక్టివిటీ వుంటేనే స్వయంగా విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు. బయటకు వెళ్లి తనిఖీలు చేస్తుంటేనే పాలనసవ్యంగా సాగుతుందని చంద్రబాబు చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి ధ్వజం ఎత్తారు.
పేదరిక నిర్మూలన పథకాలను కచ్చితంగా అమలు చేస్తున్న రాష్ట్రాలకు ఊతం ఇవ్వల్సిందిపోయి కేంద్రం తన విధానాల ద్వారా అదనపు భారాన్ని వేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ విషయం వివిధి జాతీయ వేదికల ద్వారా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకుపోయినట్టుగా ఆయన చెప్పారు. వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలను కొన్ని వారాల ముందుగానే ప్రజల ముందు పెట్టనున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చర్చకు వీలుంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెచ్చించే ప్రతిపైసా సద్వినియోగం కావాలన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications
