లైంగిక వేధింపుల కేసు.. 'ఢీ-10' డ్యాన్స్‌ షో విజేత రాజు అరెస్ట్.. రిమాండ్‌ కు తరలింపు

ప్రముఖ డాన్స్ రియాల్టీ షో ఢీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు డాన్సర్, కొరియోగ్రాఫర్ రాజు.. అయితే ఆయన్ను తాజాగా మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో రాజును అరెస్ట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. అతడు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది.

ఈ నెల 9 న ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తనను లైంగికంగా వేధించాడని, సినీ రంగంలో అవకాశాల పేరుతో వంచించాడని ఫిర్యాదులో స్పష్టం చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించడంతో వెంటనే రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు. యువతి చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదై 3 రోజులవుతున్నా మియాపూర్ పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటకు రానివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Dhee10 winner Raju Sexual harassment case Dhee-10 dance show winner Raju arrested and remanded

ప్రస్తుతం రాజు జైలులో ఉన్నాడు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు ఇటు బుల్లితెర వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు ఈ వ్యవహారాన్ని ఎందుకు దాచారన్నది తెలియాల్సి ఉంది. ఇక రాజు ఢీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఢీ రియాల్టీ షో పలు సీజన్‌ లలో రాజు పాల్గొన్నాడు. ఢీ 10 వ సీజన్ విజేతగా నిలిచిన రాజు.. ఇటీవల ముగిసిన ఢీ 20 సీజన్ టైటిల్ కూడా కైవసం చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+