బ్రిక్స్ దేశాధి నేతలకు పూర్తిగా శాకాహార విందు.. ఫుల్ మెనూ ఇదే..!
18వ శిఖరాగ్ర బ్రిక్స్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ పసందైన విందును ఏర్పాటు చేశారు. పూర్తిగా శాఖాహారంతో దేశ సంస్కృతి, సంప్రదయాలను ప్రతిబింబించేలా కమ్మని ఆహారాన్ని వంటకాలను ఏర్పాటు చేశారు. కేవలం రుచి మాత్రమే కాకుండా, పర్యావరణ స్పృహ, సమ్మిళితత్వం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మెనూను తీర్చిదిద్దడం విశేషం అని చెప్పొచ్చు. శనివారం రాత్రి దేశ రాజధాని దిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ గాలా డిన్నర్ లో పలు దేశీయ వంటకాలు స్పెషల్ గా నిలిచాయి.
స్టార్టర్స్ గా గుజరాతీ సంప్రదాయ వంటకమైన ఖండ్వీ మిల్లే- ఫుయెల్లీ, ఖుంబ్ గలౌటీ, మెయిన్ కోర్స్ లో పనీర్ లబాబ్దార్, గుచ్చీ మార్మిక్, క్యారెట్ బీన్ పొరియాల్, తక్కలి బెల్లే సారు, మిల్లెట్ పులావ్, బీట్ రూట్ రైతా, ఇండియన్ బ్రెడ్ లు ఏర్పాటు చేశారు. డెజర్ట్స్ కిందకు ఓల్డ్ దిల్లీ ఫ్రూట్ ఐస్ క్రీమ్- జిలేబీ, షాహ్ తూట్ ఫిర్నీ ఏర్పాటు చేశారు. విందుతో పాటు అతిథుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. నవరస- భావోద్వేగాల విశ్వం పేరిట దాదాపు 120 మంది కళాకారులతో దేశంలోని విభిన్న సంగీత సంప్రదాయాలు, వాయిద్యాలను భారతీయ శాస్త్రీయ నృత్యంతో మేళవించి, విభిన్న నాగరికతలను కలిపేలా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

అలాగే భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ నృత్యాలను చూసి బ్రిక్స్ దేశాధినేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓ 20 నుంచి 25 నిమిషాల పాటు జరిగింది. భారతీయ కళాకారులు ఈ నృత్య కార్యక్రమం కోసం దాదాపు 2 రోజులు ప్రాక్టిస్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక అంతకుముందు జరిగిన బ్రిక్స్ సమావేశంలో న్యూ దిల్లీ డిక్లరేషన్ 2026 కు బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. భారత్ న్యూ దిల్లీ డిక్లరేషన్ కు కూటమిలోని ఏ దేశం కూడా అభ్యంతరం చెప్పలేదని.. ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన భారత్ కు ఇది అతిపెద్ద దౌత్య విజయం అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications
