"ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్..!" కేంద్రమంత్రి అరుదైన ప్రశంస..!
అమరావతిలోఏర్పాటు చేస్తున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సూచనకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) సానుకూలంగా స్పందించారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం నుంచి సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు విషయంలో చంద్రబాబు ఆలోచన బాగుందని, ఆయన చేసిన వివిధ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
విజయవాడలో వైద్యారోగ్య శాఖకు చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న కేంద్రమంత్రి నడ్డా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంజీవని కార్యక్రమంపైనా ప్రశంసలు కురిపించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రజలకు ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, నివారణ, మెరుగైన చికిత్సతో పాటు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

Thank you, Hon’ble Union Health Minister Shri @JPNadda Ji, for joining us in Vijayawada to launch 10 Critical Care Blocks and 12 Integrated Public Health Labs under the PM-ABHIM scheme across Andhra Pradesh, strengthening emergency care, early diagnosis and disease surveillance.… https://t.co/zyaILU9EEs pic.twitter.com/UpaZg86WwW
— N Chandrababu Naidu (@ncbn) September 12, 2026
సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ సురక్షితమైన చేతుల్లో ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. చంద్రబాబు విజన్, నిబద్ధత కలిగిన నాయకుడని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పోషించిన పాత్రను మరువలేమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని కొనియాడారు. వైద్యారోగ్య రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నడ్డా తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన వంటిల్లే ఫార్మసీ-ఆహారమే ఔషధం అనే విషయాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన ప్రసంగంలో వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు. చంద్రబాబు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు వేదికపైకి రాగానే వైద్య విద్యార్థులు, సభికులు పెద్దఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. సీఎం ప్రసంగం సాగుతున్నంత సేపు అడుగడుగునా చప్పట్లతో కళావేదిక మార్మోగింది. దీంతో చంద్రబాబు కూడా అంతే ఉత్సాహంతో స్పందించారు. సభ ముగిసిన తర్వాత సభికుల ఆనందోత్సాహాల్లో పాలుపంచుకుంటూ.. వేదిక మీద నుంచే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి సీఎం చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నారు.














Click it and Unblock the Notifications
