బిన్‌లాడెన్, ముల్లా ఒమర్ హతం
న్యూయార్క్‌ః తాలిబన్ల చివరి స్థావరం కాందహార్‌పై గత రెండు రోజులుగా ఎడతెగని బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా తమ దాడుల్లో అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్, తాలిబన్ సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్ మరణించినట్టుగా భావిస్తున్నది.
ఇంటలీజెన్స్ సంస్థల నుంచి అందిన అత్యంత విశ్వసనీయం సమాచారం ప్రకారం కాందహార్‌లో అల్‌ఖైదా, తాలిబన్‌లకు చెందినవిగా భావిస్తున్న ఇళ్లు, ప్రాంగణాలపై అమెరికన్ యుద్ధ విమానాలు ఎటువంటి ప్రతిఘటన లేకుండా టన్నుల కొద్ది బాంబులను ఎడాపెడా గుప్పించాయి. తాలిబన్ సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్, అల్‌ఖైదా అగ్రనేత లాడెన్ వారి ముఖ్య అనుచరు, సీనియర్ నేతలతో కలసి సమావేశం జరుపుతున్న ఒక ప్రాంగణంపై అమెరికన్ విమానాలు పెద్దఎత్తున దాడులు జరిపాయి.
ఈ దాడిలో వారంతా మరణించి వుంటారని తాము భావిస్తున్నట్టుగా అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి విక్టోరియా క్లార్క్ చెప్పారు. ఇంటలీజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చిన కొద్ద క్షణాల్లోనే యుద్ధ విమానాలు దాడి జరిపాయని ఆయన చెప్పారు.
శత్రువుకు జరిగిన నష్టం గురించి పూర్తి అంచనాలు ఇంకా అందాల్సి వున్నదని అదే విధంగా మృతుల్లో ముల్లా ఒమర్, లాడెన్ వున్నారా లేదా కూడా ధృవపడాల్సివున్నదని ఆయన వెల్లడించారు. ఇదిలా వుండగా మరోవైపు అమెరికా కాందహార్‌లో తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. మరికొంతమంది కమాండోలు కూడా కాందహార్ చేరుకున్నారు. ఒమర్, లాడెన్ హతమైనట్టు ధృవపడితే తప్ప అమెరికా ఈ దాడులను నిలిపివేసే యోచనలో లేదు.












Click it and Unblock the Notifications
