కడలూరుః కల్తీ సారా తాగి తమిళనాడులోని కడలూరు జిల్లా పాన్రుతిసమీపంలో 22 మంది మరణించారు. మరో 40 మంది తీవ్రఅస్వస్థతగు గురై ఆస్పత్రిలో వున్నారు. వీరిలో 15 మంది పరిస్థితి ఆందోళన కరంగా వున్నదని పోలీసులు చెప్పారు. గురువారం రాత్రి పొద్దుపోయాక ఈ సంఘటన జరిగినట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు. నాథమ్ గ్రామ సమీపంలో కొందరు వ్యక్తులు కొద్ది గంటల తేడాతో కల్తీ సారాసేవించి అస్వస్థతకు లోనయ్యారు. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా 16 మంది ఆస్పత్రిలో కన్ను మూశారు. మరో వ్యక్తి మార్గమధ్యంలోనే మరణించాడు. తీవ్రఅస్వస్థతో వున్న 40 మందికి వైద్యులు అత్యవసర చికిత్స చేస్తున్నారు.
కల్తీ సారాఅమ్మిన ఇద్దురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈవిషాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 27న కల్తీ మద్యం తాగి ముగ్గురు మరణించారు.అక్టోబర్ 6న కల్తీ మద్యం సేవించిన దుర్ఘటనలో 30 మంది మరణించారు. రోజుల తేడాలో కల్తీ మద్యం సంఘటనలు చోటుచేసుకోవడం తమిళనాడులో కలవరం సృష్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications