గ్లోబల్ ట్రస్ట్ సిఎండి రాజీనామా
హైదరాబాద్‌ః గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సిఎండి హుగర్ తన పదవికి రాజీనామా చేసినట్టుగా తెలిసింది. బ్యాంక్ సంస్థాపక చైర్మన్ రమేష్ గెల్లీ, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించితనపై వచ్చిన ఆరోపణల కారణంగా రాజీనామా చేయడంతో హుగర్ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే.
ఈ బాధ్యతలుస్వీకరించి ఎనిమిదినెలలు కూడా కాకుండానే హుగర్ రాజీనామాకు సిద్ధపడటం బ్యాంకింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయాలని హుగర్ నిర్ణయించినట్టుగా గ్లోబల్‌ట్రస్ట్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నప్పటికీ కారణాలు వేరే వున్నాయనిఅంటున్నారు. గెల్లీ విధేయులైన జటిబి యంత్రాంగం కారణంగా ఎదురవుుతున్న ఇబ్బందులు హుగర్ రాజీనామాకు కారణాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
