కల్తీసారా మృతుల సంఖ్య 52
కడలూరుః తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుటీలో కల్తీసారా తాగి మరణించిన వారి సంఖ్య 52కు చేరుకున్నది. మరో రెండు వందల మంది మృత్యువుతోపోరాడుతున్నారు.
మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశం వున్నదని వైద్యవర్గాలు అంటన్నాయి. చికిత్సపొందుతున్న వారిలో అనేక మంది పరిస్థితి తీవ్రంగా వుంది.ముప్పయిమంది ఇప్పటికే కంటిచూపు కోల్పాయారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే చెన్నై నుంచి ప్రత్యేక వైద్య బృందం కడలూరు చేరుకున్నది. మృతుల్లో అత్యధిక శాతం మంది నిరుపేద కూలీలే. ప్రభుత్వం ఈ సంఘటనకు సంబంధించి కొందరు స్థానిక పోలీసులను సస్పెండ్ చేసింది.విచారణకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications
