న్యూఢిల్లీః పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించేఅంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లు పాల్గొనే ట్రయాంగ్యులర్ సిరీస్ కు అనుమతించాల్సిందిగా బిసిసిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈఅంశంపై విదేశాంగ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ మంగళవారం లోక్ సభకువివరించారు. ఈ సిరీ స్ పై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ తో కనీసం మూడేళ్ళ పాటు క్రికెట్ ఆడరాదని గతంలో భారత్ ప్రభుత్వం సంకల్పించింది. పలు దేశాలు పాల్గొనే టోర్నమెంట్ లలో పాక్ తో ఢీకొనేందుకు అభ్యంతరం లేనప్పటికీ పాకిస్తాన్ తో నేరుగా క్రికెట్ ఆడరాదని భారత్ నిర్ణయించింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వైఖరిలో మార్పు రావడం, గత వారంలోఐసిసిపై భారత్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సందర్భంగా పాక్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా భారత్ కు వత్తాసు పలికిన దృష్ట్యా పాక్ తో క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయనవివరించారు.












Click it and Unblock the Notifications
