అలసట, విపరీతమైన నొప్పులు.. ఈ లోపం కావచ్చు.. నిర్లక్ష్యం చేస్తే డేంజర్!
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అది పోషకాలతో కూడుకొని ఉండాలి. శరీరానికి కావలసిన పోషకాలు తప్పనిసరిగా అందాలి. ముఖ్యంగా విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. విటమిన్ డి లోపం ఉంటే శరీరంలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి . శరీరంలో విటమిన్ డి లోపిస్తే విపరీతమైన అలసటగా ఉంటుంది.
విటమిన్ డీ లోపంతో శరీరంలో కండరాలు, నరాలు ప్రభావితం అవుతాయి. ఊరికే నిద్ర వచ్చినట్టుగా, బాగా చిరాకుగా అనిపిస్తుంది. ఏ పని చేయడానికి శక్తి లేదు అనిపిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. విపరీతమైన ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. అంతేకాదు విటమిన్ డి లోపిస్తే చర్మం పొడిబారడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉన్నవారిలో జుట్టు రాలే సమస్య కూడా ఉంటుంది.

ఎవరికైతే విటమిన్-డి లోపం ఎక్కువగా ఉంటుందో వారికి వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పదేపదే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు విటమిన్ డి లోపం కూడా కారణమని గ్రహించాలి.
విపరీతంగా జాయింట్ పెయిన్స్ ఉంటే, విటమిన్ డి లోపం కావచ్చు అన్నది గుర్తించాలి. కండరాల నొప్పులు, నరాల బలహీనతలకు విటమిన్ డీ లోపం ఒక కారణం. ఇలా నొప్పులు ఎక్కువగా వచ్చే వారు విటమిన్ డి లోపాన్ని సరి చేసుకోవాలి. ఇక విటమిన్ డి లోపంతో బాధపడేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ డి పుష్కలంగా ఉండే విధంగా చూసుకోవాలి.
ముఖ్యంగా ఆహారంలో చేపలు, గుడ్లు, పాలు ఉండేలా చూసుకోవాలి. సోయాబీన్, గుడ్లు, చీజ్, సీజనల్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు తింటే విటమిన్ డీ అందుతుంది. మన శరీరానికి కావాల్సిన పోషకాల కోసం తినాల్సినవి మాత్రమే కాదు. ప్రతీ రోజూ 11 గంటల నుండి 2 గంటల మధ్య మన శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. ప్రభాత సూర్యుని కిరణాలు మన శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, ఆహారం అలవాటు చేసుకుంటే విటమిన్ డీ లోపం నివారణ అవుతుంది.













Click it and Unblock the Notifications
