వాయిదా తీర్మానానికిస్పీకర్ నో
హైదరాబాద్‌ః స్థానిక సంస్థల ఉద్యోగులకు డి.ఎ. ఇచ్చే అంశంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్
త్రోసిపుచ్చారు. స్థానిక సంస్థల ఉద్యోగులు సకాలంలో జీతాలు లేక, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డి.ఎ. లేక నానా అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్, సిపిఎం. గురువారం అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై వాయిదా తీర్మానానికి అనుమతించాల్సిందిగా కాంగ్రెస్, సిపిఎం కోరాయి. అయితే ప్రతిపక్షాల వాయిదా తీర్మానాన్ని త్రోసిపుచ్చుతున్నట్లు స్పీకర్ ప్రతిభా భారతి ప్రకటించారు.
వేలాది ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఈ కీలక అంశంపై వాయిదా తీర్మానానికి అనుమతించక పోవడం పట్ల ప్రతిపక్ష నాయుకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. డి.ఎ.లేక స్థానిక సంస్థల ఉద్యోగులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వై.ఎస్. డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications