8000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో iQOO 15T లాంచ్!
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO ఎదుగుతోంది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. దీంతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్-ఫ్రెండ్లీ సెగ్మెంట్‌లో మరో బలమైన పోటీదారుగా మారుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'ఐకూ 15టీ'ను చైనా మార్కెట్లో ఘనంగా విడుదల చేసింది.
కాగా 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, అత్యాధునిక సాంకేతికత, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, ప్రీమియం డిస్‌ప్లేతో ఈ ఫోన్ గేమింగ్ ప్రియులు, టెక్ లవర్స్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 9500 మాన్‌స్టర్ ఎడిషన్ చిప్‌సెట్‌తో వచ్చిన ఫోన్‌గా ఇది గుర్తింపు పొందింది.

ఐకూ 15టీ ఫీచర్స్..
డిస్‌ప్లే..
ఐకూ 15టీ స్మార్ట్‌ఫోన్‌లో 6.82 అంగుళాల 2కే ఎల్టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఈ తెర 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా అనిపిస్తుంది. అతి తక్కువ బెజెల్స్‌తో వచ్చిన ఈ డిస్‌ప్లే ప్రకాశవంతమైన రంగులు, స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది.
ప్రాసెసర్..
ఈ ఫోన్‌కు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 మాన్‌స్టర్ ఎడిషన్ ప్రాసెసర్‌ను అమర్చారు. గ్రాఫిక్స్ పనితీరును మెరుగుపరచేందుకు ప్రత్యేకంగా క్యూ3 సూపర్ కంప్యూటింగ్ చిప్‌ను కూడా జోడించారు. దీంతో భారీ గేమ్స్, వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ పనులు ఎలాంటి ల్యాగ్ లేకుండా సాగుతాయి.
భారీ ర్యామ్, స్టోరేజ్..
ఐకూ 15టీ 16జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబీ వరకు యూఎఫ్‌ఎస్ 4.1 స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎక్కువ యాప్స్, భారీ గేమ్స్, హై క్వాలిటీ వీడియోలను సులభంగా స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కెమెరా..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఐకూ 15టీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. 4ఎక్స్ లాస్‌లెస్ జూమ్, సీపీఏ 4.5 స్థాయి స్టెబిలైజేషన్ ఫీచర్లు స్పష్టమైన ఫోటోలు, వీడియోలను అందిస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ముందు కెమెరాను అందించారు.
8000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 8000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు ఉంది. కొద్ది నిమిషాల్లోనే ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది. దీర్ఘకాలిక గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఆధునిక భద్రత, కనెక్టివిటీ..
భద్రత కోసం 3డి అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. అలాగే 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
రంగులు..
ఐకూ 15టీ 'క్వింగ్‌యున్', 'ట్రాక్ ఎడిషన్', 'లెజెండ్ ఎడిషన్' అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో విడుదలైంది. ప్రీమియం డిజైన్‌తో ఈ ఫోన్ యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
ధరలు ఇలా..
12జీబీ + 256జీబీ - సుమారు ₹58,000
12జీబీ + 512జీబీ - సుమారు ₹64,000
16జీబీ + 256జీబీ - సుమారు ₹68,000
16జీబీ + 512జీబీ - సుమారు ₹74,000
16జీబీ + 1టిబీ - సుమారు ₹85,000
ఐకూ 15టీ ప్రస్తుతం గేమింగ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తోందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications