కొత్త పెన్షన్ల మంజూరు వీరికే, అర్హుల జాబితా- తాజా ఆదేశాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా కలెక్టర్లకు పెన్షన్ల పైన పంచాయితీ రాజ్ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. అర్హుల జాబితాలు సిద్దం చేయాలని నిర్దేశించింది. ఇప్పటికే పెన్షన్ల కోసం దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. కాగా, బడ్జెట్ లో ఇప్పటి కే ప్రకటించిన రెండు లక్షల పెన్షన్ల తో పాటుగా రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. దరఖాస్తులు.. అర్హతల పైనా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వీటికి సంబంధించి మరో ముఖ్య నిర్ణయంతో ముందుకు వెళ్తోంది.
తెలంగాణలో కొత్త పెన్షన్లు.. ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయితీ రాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42 లక్షల మందికి పైగా చేయూత/ఆసరా పెన్షన్లు పొందుతు న్నారు. కొత్తగా 2 లక్షల మందికి ఆమోదం ఇచ్చారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పెన్షన్లకు నిధులు కేటాయించి, జూన్ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అది అంచనా మాత్రమే. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు వంటి వర్గాలకు ఈ చేయూత పెన్షన్ పథకం వర్తిస్తుంది.

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ
కాగా, ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు మొదలైనవారికి నెలకు రూ.2,016, దివ్యాంగుల కు రూ.4,016 ఇస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెన్షన్‌ని రూ.4,000కి పెంచుతామని హామీ ఇచ్చింది. అది ఇంకా అమలు కాలేదు. ఇప్పటివరకూ పెన్షన్ పొందకుండా, కొత్తగా పెన్షన్ పొందాలి అనుకునేవారు గ్రామ సభలు, ప్రజా వాణి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ కొత్త కార్డుల మంజూరు ప్రారంభించాలని నిర్ణయించారు. అదే విధంగా కొత్త రేషన్ కార్డుల ఆమోద ప్రక్రియ నిరంతరం కొనసాగించేందుకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. గ్రామ సభల్లో అర్హులను గుర్తించి.. ప్రభుత్వానికి జాబితా పంపనున్నారు. దీంతో.. జూన్ 2వ తేదీ నుంచి రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.













Click it and Unblock the Notifications