బొగ్గు కేసులో జయకువిముక్తి
చెన్నయ్‌ః 6.5 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం కేసు నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు విముక్తి లభించింది. ఈ కేసులో జయలలితతో పాటు నిందితులంతా నిరోషులని చెన్నయ్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. జయలలితతో పాటు నిందితులపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జయలలితతో పాటు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి కన్నప్పన్, నలుగురు ఐ.ఎ.ఎస్. అధికారులు ఈ కేసులో నిందితులుగా వున్నారు. బొగ్గు దిగుమతి కేసులో జయలలిత అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈ కేసు దాఖలు చేశారు. ఆస్ట్రేలియా, ఇండొనేసియాల నుంచి 1992-93 బూడిదశాతం ఎక్కువ వున్న నాసిరకం బొగ్గును దిగుమతి చేసుకొనే వ్యహారంలో 6.5 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని డిఎంకె ప్రభుత్వం జయలలితపై కేసు పెట్టింది.
తనపై అనవసరంగా కేసులు బనాయించారనేందుకు ఈ తీర్పు మరో నిదర్శనమని ఈ సందర్భంగా జయలలిత వ్యాఖ్యానించారు. టాన్సీ భూముల కేసు నుంచి కూడా జయలలిత ఇటీవల నిర్దోషిగా బయటపడిన విషయం విదతమే. తాజా పరిణామాల దరిమిలా ఉపఎన్నికల్లో పోటీ చేసి, గెలుపొంది తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనేందుకు జయకు మార్గం సుగుమం అవుతున్నది.












Click it and Unblock the Notifications