నెల్లూరు ప్రమాదంలో ఏడుగురు మృతి
నెల్లూరుః నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు. చిత్తూరు జిల్లా కాసారం లో వున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కనీసం 70 మంది రెండు ట్రాక్టర్లలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తమిళనాడు నుంచి వస్తున్న మాంసం లారీ ట్రాక్టర్ ను డీ కొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రాణాపాయ స్థితిలో వున్న ఇద్దరు ప్రయాణికుల్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో మరో 25 మంది కూడా గాయపడ్డారు. వీరందరూ నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications