గన్ షిఫ్ లను మొహరిస్తున్న పాకిస్తాన్
న్యూఢిల్లీః భారత పార్లమెంటుపై దాడి జరిగిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల దరిమిలా భారత-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. గురువారం నాడు కూడా భారత్ - పాక సేనల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. తాజా ఉద్రిక్తతతో భయాందోళనలకు లోనౌతున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు పాకిస్తాన్ లో కీలక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. మరోపైవు పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గురువారం సాయంత్రం మరోసారి సమావేశం కానుంది. లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలపై పాకిస్తాన్ నిషేధాన్ని విధిస్తున్నట్లు పాక్ ప్రకటించడం కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని భారత్ అభిప్రాయపడింది.
పాకిస్తాన్ విమానాశ్రయాల వద్ద యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ లను మొహరించడం తాజా పరిణామం. పాకిస్తాన్ లోని అన్ని విమానాశ్రయాలవద్ద అలర్ట్ ప్రకటించారు. భారత్ పాక్ లు సంయమనం పాటించాల్సిందిగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కొలిన్ పావెల్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications