ఆర్మీ డే పెరేడ్ రద్దు
న్యూఢిల్లీ: ఏటా జనవరి 15న జరిగే ఆర్మీ డే పెరేడ్ ను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. పార్లమెంట్ పై దాడి, యుద్దం వచ్చే సూచనలు నెలకొన్న నేపథ్యంలోపెరేడ్ ను రద్దు చేశారు. 1949 నుంచి క్రమంతప్పక జరుగుతూ వస్తున్నపెరేడ్ ను రద్దు చేయడం ఇదే మొదటి సారి. అయితే రిపబ్లిక్ డే రోజు మాత్రంపెరేడ్ జరుగుతుంది. ఈపెరేడ్ ను కూడా కుదించనున్నారు. సరిహద్దు ప్రాంతానికి సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని భారీ ఎత్తున తరలించాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రక్షణ మంత్రి జార్జి ఫెర్నెండెజ్, విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ బుధవారం తెలిపారు. ఆర్మీ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించిన అనంతరం సైనిక దళాల ప్రధాన అధికారి ఎస్.పద్మనాభన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ఏటా న్యూఢిల్లీలోని కంటోన్మెంట్ లో జనవరి 15న ఈపెరేడ్ జరుగుతుంది. 1949లో భారత తొలి సైనిక దళాల ప్రధానాధికారిగా జనరల్ కరియప్పా బాధ్యతలు చేపట్టడంతో ఈపెరేడ్ ప్రారంభమైంది. అప్పటినుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరంపెరేడ్ భారీ ఎత్తున జరుగుతూ వస్తోంది. దాదాపు 5000 మంది సైనికులు ఇందులో పాల్గొంటారు.పార్లమెంట్ పై దాడిని భారత్ ఆషామాషీగా వ్యవహరించడం లేదని పాక్ కు దీంతో అర్థమవుతుందని ఆర్మీ ప్రతినిధి ఒకరు అన్నారు.












Click it and Unblock the Notifications