రైల్వే స్టేషన్‌పేల్చేసిన పీపుల్స్ వార్
అనంతపురంః అనంతపురం జిల్లాలో పుట్టపర్తి- ధర్మవరం లైన్ లో వున్న ఘటంపల్లి రైల్వే స్టేషన్ ను పీపుల్స్ వార్ నక్సలైట్లు గురువారం వేకువజామున పేల్చివేశారు. నూతనంగా నిర్మించిన పుట్టపర్తి-థర్మవరం లైన్ లో బుధవారం సాయంత్రమే ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ప్రారంభించిన మరుసటి రోజే ఈ రైల్వే స్టేషన్ నక్సలైట్లు ఆగ్రహ జ్వాలల్లో భస్మం కావడం గమనార్హం.
కనీసం పదిమంది పీపుల్స్ వార్ నక్సలైట్లు ఈ రైల్వే స్టేషన్ భవనాన్ని శక్తివంతమైన బాంబులతో పేల్చి వేశారు. వేరు శనగ రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా రైల్వే స్టేషన్ ను పేల్చి వేస్తున్నట్లు పీపుల్స్ వార్ నక్సలైట్లు అక్కడ వదలి వెళ్ళన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications