రక్షణ శాఖకు నిధులుఒకె: సిన్హా
న్యూఢిల్లీ: దేశ రక్షణావసరాలు తీర్చడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 65 కోట్ల రూపాయల బడ్జెట్ సరిపోతుందని ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా చెప్పారు. పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్‌తో సమావేశమైన అనంతరం ఆయన గురువారం ఈ విషయం చెప్పారు.
రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదన ఏదీ చేయలేదని, ఒకవేళ రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు నిధులు అడిగితే ఆ విషయం పరిశీలిస్తామని ఆయన అన్నారు. పాకిస్థాన్‌తో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటన వెలువడింది. జాతీయ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, మన సాయుధ దళాల అవసరాలన్నింటినీ తీరుస్తున్నామని, అవి నిధులు, ఆయిల్ లేదా ఏ విధమైన అవసరాలైనా సరేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications