వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమర్‌ అరెస్టయి వుండవచ్చు:అఎn్ఘాన్‌ మంత్రి

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌: తాలిబాన్‌ నేత ముల్లా మహ్మద్‌ ఒమర్‌ అరెస్టయి వుండవచ్చునని అఎn్ఘానిస్థాన్‌ పునర్నిర్మాణ శాఖ మంత్రి అమీర్‌ ఫర్హాంగ్‌ అన్నారు. ఒమర్‌ అరెస్టయి వుండవచ్చననేది తాను విన్నానని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని ఆయన జర్మన్‌ ఎఆర్‌డి టీవితో శుక్రవారం తెల్లవారు జామున చెప్పారు. పర్వత ప్రాంతాల్లోని రహస్య స్థావరంలో ఒమర్‌ను చుట్టుముట్టినట్లు గార్డియన్‌ వార్తా పత్రిక రాసింది.

ఇదిలా వుంటే, వారం రోజులు విరామం ఇచ్చిన అమెరికా శుక్రవారం తొరబోరా గుహల దక్షిణ ప్రాంతంలో వైమానిక దాడులు నిర్వహించింది. ఆల్‌ ఖయిదా తీవ్రవాదులు, తాలిబాన్‌ కార్యకర్తలు ఇక్కడ పునరేకీకరణ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రతినిధి చెప్పారు. ఈ ప్రాంతం పాకిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో వున్నదని ఆయన చెప్పారు. తాలిబాన్‌ నేత ఒమర్‌ను, ఆల్‌ ఖయిదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ను న్యాయస్థానం ముందు నిలబెడుతామని అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్‌ఫీల్డ్‌ అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X