
ఉగ్రవాదంపై ముషారఫ్‌కు బుష్ సూచన
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాద గ్రూప్‌ల అణచివేతను మరింత తీవ్రం చేయాలని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను కోరారు. పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవడంతో భాగంగా ఆయన తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. భారత, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు తీవ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపడం అవసరమని ఆయన అన్నారు.
పాకిస్థాన్,
భారత్‌ల
మధ్య
ఉద్రిక్తతలు
ఇంకా
తగ్గాల్సే
వున్నదని
ఆయన
అభిప్రాయపడ్డారు.
తీవ్రవాదాన్ని
అరికట్టే
విషయాన్ని
ప్రపంచానికి
తెలియజేసేందుకు
ముషారఫ్
స్పష్టమైన
ప్రకటన
చేయడం
అవసరమని,
తీవ్రవాదాన్ని
ముషారఫ్
అణచివేస్తే,
అణచివేతను
కొనసాగిస్తే
తీవ్రంగా
ఉన్న
ఉద్రిక్తతలు
తగ్గుతాయని
ఆయన
అన్నారు.
ఉద్రిక్తతలను నివారించి పరస్పర సహకారం పెంపొందించుకునేందుకు పాక్, భారత్‌లు చర్చలు జరిపి తీవ్రవాద వ్యతిరేక పోరుపై దృష్టి కేంద్రీకరించాతలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రిచర్డ్ బౌచర్ కోరారు. ఉభయ దేశాలు సంయమనంతో వ్యవహరించి హింసను తగ్గించుకోవాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు. ఉద్రిక్తతలను తగ్గింపునకు తాము భారత్‌కు, పాకిస్థాన్‌కు ఒక ఉన్నతాధికారిని పంపుతామని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
వారంతంలో
పాకిస్థాన్‌లో
చాలా
మంది
ఉగ్రవాదులను
అరెస్టు
చేశామని
ముషారఫ్
చెప్పినట్లు
ఆయన
తెలిపారు.
ఖాట్మండులో
వాజ్‌పేయి,
ముషారఫ్‌లు
కరచాలనం
చేసుకోవడం,
ఇష్టాగోష్టిగా
మాట్లాడుకోవడం
ఎంతో
ఉపయోగకరమైనవని
ఆయన
అన్నారు.