వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ మేయర్ బరిలో 57 మంది
హైదరాబాద్‌ః ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ నగర మేయర్ పదవికోసం 57 మంది పోటీ చేస్తున్నారు. బుధవారం నాడు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో 57 మంది మిగిలారు. ఇంత మంది అభ్యర్థులు రంగంలో వున్నప్పటికీ తెలుగుదేశం, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ మధ్య ప్రధానపోటీ వుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ తరపున దానం నాగేందర్, జుల్ఫికర్ ఆలీ(మజ్లిస్) బరిలో వున్నారు.
Comments
Story first published: Wednesday, January 9, 2002, 23:53 [IST]