ఓటును వ్యర్ధం చేసుకోవద్దు
హైదరాబాద్‌ః జంటనగరాల ప్రజలు అమూల్యమైన ఓటును వ్యర్ధం చేసుకోవద్దని ముఖ్యమంత్రి, తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం, బిజెపి అభ్యర్ధుల తరఫున ఆయన బుధవారం నాడు బల్దియా ఎన్నికలకోసం సుడిగాలి పర్యటన జరిపారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ఓటు వేయడం వల్ల ఓటు వ్యర్ధం అవుతుందని ఆయన చెప్పారు. టిఎస్‌ఎస్, టిఆర్‌ఎస్ వంటి విచ్ఛిన్న శక్తులను తరిమి కొట్టాలని ఆయన కోరారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
