మున్సిపల్ ప్రచారానికి తెర
హైదరాబాద్‌ః రెండు కార్పొరేషన్లు, రెండు మున్సిపాల్టీలకు జరుగుతున్న ఎన్నికలే అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే రీతిలో సాగిన ప్రచారానికి ఆదివారంతో తెరపడింది. ఆదివారం ఆఖరు రోజు కావడంతో అన్ని ప్రధాన పక్షాలు రెచ్చిపోయి ప్రచారం చేశాయి. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్, తెలుగుదేశం, ఎంఐఎం, టిఆర్‌ఎస్ నేతలు జంటనగరాల్లోని అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం జరిపారు.పెద్దఎత్తున ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. హైదరాబాద్‌లో చార్మినార్‌నుంచి కాంగ్రెస్, ఎంఐఎం ఏకకాలంలో ప్రదర్శనను ప్రారంభించడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టిఆర్‌ఎస్ నేతలు తెలంగాణాను మాత్రమే కాకుండా ధరల పెరుగుదలను కూడా ప్రధాన అస్త్రంగా ఎక్కుపెట్టారు.












Click it and Unblock the Notifications
