హోషియార్ పూర్‌ః పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లా సత్నార్ గ్రామంలో బస్సులో సంభవించిన పేలుడులో ఇద్దరు మరణించగా ఏడుగురు గాయపడ్డారు.
గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఒక మహిళ, ఓ పసికందు మరణించారు. చండీఘర్ వెళుతున్న బస్సు ఘర్షాంకర్ వద్దకు రాగానేపెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన ఏడుగురిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.