పాక్‌తో అమెరికా సంబంధాలు పటిష్టం
వాషింగ్టన్: అఎn్గాన్ యుద్ధ సమయంలో పాకిస్థాన్‌తోనూ, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలతోనూ అమెరికా అన్ని రంగాల్లో అతి సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుందని అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ చెప్పారు.సైనిక రంగంలోనే కాకుండా ఆర్థిక, దౌత్య రంగాల్లో ఈ సంబంధాలు కొనసాగుతూ వుంటాయని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అమెరికా కోరిందే తడవుగా సహాయం అందించడానికి పాకిస్థాన్ ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌కు మరింత ఆర్థిక సహాయంఅందించాల్సిన బాధ్యత తమ మీద వున్నదని ఆయన అన్నారు.
ఉజ్బెకిస్థాన్‌తో తమకు సైనిక సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. ఉజ్బెకిస్థాన్ తమ సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆయన చెప్పారు. ఉజ్బెకిస్థాన్ తమ పట్ల సహకార ధోరణి గణనీయంగా అవలంభిస్తోందని ఆయన చెప్పారు. ఈ సంబంధాలు ఉజ్బెకిస్థాన్‌కు, అమెరికాకు, నాటోకు మంచిదని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!