న్యూఢిల్లీః కేంద్ర మంత్రులు ఎల్ కె అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషిని టెర్రరిస్టులుగా పరిగణించాలని ఢిల్లీ జామా మసీదు ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ సంచలన ప్రకటన చేశారు.
భారత పార్లమెంట్‌పై డిసెంబర్ 13న జరిగిన దాడి కంటే 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ఎక్కువ తీవ్రమైన టెర్రరిస్టు చర్య అని ఆయన అభివర్ణించారు. మసీదు విధ్వంసానికి తెరవెనక పాత్రపోషించిన ముగ్గురు నాయకులుఅద్వానీ, జోషీ, ఉమాభారతిని టెర్రరిస్టులుగానే పరిగణించాలని ఆయనపేర్కొన్నారు. డబ్లుటిసిపై దాడులను తాను ఖండించడం లేదని ఆయన చెప్పారు. ఒసామాబిన్ లాడెన్‌ను అమెరికా పట్టుకోలేకపోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది అమెరికా పరాజయంగా బుఖారీపేర్కొన్నారు.