జర్నలిస్టు పెర్ల్‌కువిముక్తి?
ఇస్లామాబాద్‌ః కరాచీలో కిడ్నాప్‌నకు గురైన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక విలేఖరి డేనియల్ పెర్ల్‌కు కిడ్నాపర్ల చెరనుంచి విముక్తి లభించినట్టుగా తెలిసింది. ఈ విషయం పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. పెర్ల్ లండన్ బయలుదేరి వెళ్లినట్టుగా కూడా పత్రిక వెల్లడించింది.
ఇదిలా వుండగా పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ శనివారం నాడు అమెరికా పర్యటనకు బయలుదేరివెళ్లారు. సరిగ్గా ముషారఫ్ పర్యటన సమయంలోనేపెర్ల్ విడుదల వార్తలు రావడం గమనార్హం. ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌తో ముషారఫ్ సమావేశమవుతున్నారు.పెర్ల్ కిడ్నాప్ కారణంగా ఇప్పటివరకు ఈ పర్యటనలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవల్సివస్తుందోనన్న భయం పాకిస్తాన్ నాయకత్వంలో వుంది. ఇప్పుడుపెర్ల్ విడుదల వల్లపాకిస్తాన్‌కు మరిన్ని వరాలు లభించే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications