హైదరాబాద్‌ః సబ్సిడీలపై వేటు వేస్తేనే అభివృద్ధి పనులకు నిధులు సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. బుధవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణా జిల్లాలకు చెందిన కార్యకర్తల శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ సబ్సిడీలు ప్రభుత్వానికి తలకుమించిన భారంగా తయారయ్యాయని ఆయన చెప్పారు.అప్పులపై అన్ని వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచడం వల్లవిపక్షాలు నోరెత్తలేకపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మొత్తంలో ఆప్పులు తెచ్చాయని అయితేఅప్పులను సద్వినియోగం చేస్తున్న రాష్ట్రం మాత్రం మనదేనని ఆయన చెప్పారు. ఆస్తుల నిర్మాణానికిఅప్పులను వాడుతున్నట్టుగా ఆయన వెల్లడించారు.అప్పుల విషయంలో తాను అనేక మంది నిపుణులతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు.