రెండో విడత: యుపిలో ఎస్‌పి ముందంజ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండో విడత సోమవారం పోలింగ్‌ జరిగిన 145 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అత్యధిక స్థానాలు గెల్చుకుంటుందని ఎగ్జిట్‌ పోల్‌సర్వేలు అంచనా వేశాయి. ఆజ్‌తక్‌ సర్వే ప్రకారం ఎస్‌పికి 145 స్థానాల్లో 52 స్థానాలు, అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి 46 స్థానాలు వస్తాయి. ఎస్‌పికి 54సీట్లు దక్కుతాయని జీటీవి తేల్చింది. కాగా, దూరదర్శన్‌ ఎస్‌పికి 65 స్థానాలు, బిజెపికి 30 స్థానాలు, బిఎస్‌పికి 36 స్థానాలు వస్తాయనిఅంచనా వేసింది. అన్ని సర్వేల ప్రకారం కాంగ్రెస్‌ నాలుగో స్థానంలో వుంది.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ రెండో విడత 55 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండో విడత ఉత్తరప్రదేశ్‌లోని 28 జిల్లాల్లో 145 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ సందర్భంగా చెదురు మొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. బిజెపి, ఎస్‌పి కార్యకర్తలకు మధ్య ఘర్షణలో ఫర్రుక్కాబాద్‌లో ఇద్దరు గాయపడ్డారు. అవురైయా జిల్లాలో బూత్‌ ఆక్రమణకు పాల్పడ్డారు.కాన్పూర్‌లో ఇరు వర్గాలవారు పరస్పరం ఓటు చేయకుండా నిరోధించుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

ఉత్తరప్రదేశ్‌ లోని 145అసెంబ్లీ స్థానాల్లో రెండో విడత పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా జరుగుతున్నది. తొలివిడతలో సుమారు వంద నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరిగినవిషయం విదితమే. రెండో విడత పోలింగ్‌ లో మధ్యాహ్నానికి 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారంఅందింది. 145 నియోజక వర్గాల్లో సుమారు 20 వేల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.

గవర్నర్‌ విష్ణుకాంత్‌ శాస్త్రి ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం భారీఎత్తున పోలీస్‌ యంత్రాంగాన్ని బరిలోకి దించింది. 300 కంపెనీల పారామిలటరీ దళాలు, సుమారు లక్ష మంది స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి విధ్వంసకర శక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా సరిహద్దులను తాత్కాలికంగా మూసివేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+