చల్లారుతున్న గుజరాత్‌అగ్నికీలలు

అహ్మదాబాద్‌ః ఐదురోజులుగా అగ్నిగుండంగా మారిన గుజరాత్‌ క్రమంగా చల్లబడుతున్నది. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన దాఖలాలు మాత్రం లేవు. అహ్మదాబాద్‌ లో ప్రశాంతత నెలకొన్నప్పటికీ ఉత్తరగుజరాత్‌ జిల్లాలలోని మారు మూల గ్రామాలలో ఆదివారం రాత్రి ఘర్షణలు జరిగాయి. గత ఐదురోజుల్లో జరిగిన మతఘర్షణల మారణకాండలో మరణించిన వారి సంఖ్య 600కు చేరుకుంది.

బనస్‌ కాంత, సబర్‌ కాంత జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ రెండు జిల్లాల్లో ఆదివారం రాత్రి 10 మంది వరకు మరణించారు. ఆ రెండు జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే వున్నట్లు సోమవారంఅందిన వార్తలను బట్టి తెలుస్తున్నది. సబర్‌ కాంత జిల్లాలోని నవశేషన్‌ నగర్‌ లో కనీసం ఆరుగురు వ్యక్తుల్ని ప్రత్యర్థి వర్గాలు సజీవదహనం చేశాయి. మృతుల సంఖ్య అధికారికఅంచనాల ప్రకారమే 544కు చేరింది. మృతుల్లో 84 మంది పోలీస్‌ఫైరింగ్‌ లో చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+