ప్రత్యూష కేసు సిబిఐకి అప్పగింత
హైదరాబాద్‌ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష కేసును సిబిఐ కిఅప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. గురువారంఅసెంబ్లీలో ఈ కేసుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దోషులెవరైనా వదిలేది లేదని హోం మంత్రి దేవేందర్ గౌడ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేశంగా ప్రసంగించారు. ప్రత్యూష మరణానికి మొదట ఒక మంత్రి, ఆ తరువాత ఇద్దరు మంత్రుల కుమారులు కారణం అనే వార్తలతో రాష్ట్రం అట్టుడికిపోతున్నదని, ఇంతటి సంచలనమైనవిషయంపై సిబిఐ విచారణ జరిపించడంలో తప్పేమిటని టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.












Click it and Unblock the Notifications
