అయోధ్యలో పూజకు సుప్రీంకోర్టు నో
న్యూఢిల్లీః అయోధ్యలో పూజ నిర్వహించేంకు అనుమతి ఇవ్వరాదని, అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.వివాదరహిత స్థలం కూడా ప్రభుత్వ అధీనంలో వున్నది కాబట్టి అక్కడ ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. అంతకు ముందు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో మాట్లాడిన సోలి సొరాబ్జి అయోధ్యలో నామమాత్ర పూజకు అనుమతించాల్సిందిగాకోరారు. అయోధ్యలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్న దరిమిలా లాంఛనప్రాయమాన పూజకు అనుమతించాలని సొరాబ్జికోరారు.
లాంఛనప్రాయమైన పూజకు సైతం సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో మార్చి 15నవిశ్వహిందూ పరిషత్ ఏం చేస్తుందో వేచి చూడాలి. ఈ తీర్పుతో వాజ్‌పేయి గుండెల మీద నుంచి సగం బరువు దిగిపోయినట్లయింది.












Click it and Unblock the Notifications
