హవానాః క్యూబాలో చిన్న సైజు ప్రయాణికుల విమానం కుప్పకూలిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 13 మంది విదేశీయులు వున్నారు.
అంతర్జాతీయ కాలమానం ప్రకారం శుక్రవారం మూడు గంటలకు ప్రభుత్వంవిమానమైన ఎరో టాక్సీ ఏవన్-2 రాజధాని నగరం క్యూబాకు 270 కిలోమీటర్ల దూరంలోని శాంటాక్లారా వద్ద కూలిపోయినట్టు అధికార వర్గాలు చెప్పాయి. చనిపోయిన వారిలో ఆరుగురు కెనడియన్లు,అయిదుగురు బ్రిటీష్ పౌరులు, నలుగురు క్యూబన్లు, ఇద్దరు జర్మన్లు వున్నారు. దక్షిణ తీరప్రాంత పట్టణమైనసీన్‌వ్యూగోస్ నుంచి ఉత్తర విహార ప్రాంతమైన కేయోకోకోకు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగిందనిఅంటున్నారు.