లోక్‌సభలో మళ్లీ పోటో

న్యూఢిల్లీః తీవ్రవాద నిరోధానికి ఉద్దేశించిన వివాదాస్పద పోటో బిల్లును చట్టం చేసే విషయంలో ప్రభుత్వం పట్టుదలగా వుంది. సోమవారం నాడు సవరించిన పోటో బిల్లును హోం మంత్రి అద్వానీ విపక్ష సభ్యుల తీవ్ర ప్రతిఘటన మధ్య సభలో ప్రవేశపెట్టారు. గతంలో పోటో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మానవహక్కుల కమిషన్‌, ప్రజాసంఘాలు బిల్లుపై లేవనెత్తిన అభ్యంతరాలను చేసిన సూచనలను సవరించిన పోటో బిల్లులో పొందుపర్చినట్టు హోం మంత్రి చెప్పారు.

సభలో చర్చ సందర్భంగా సభ్యులు చేసే సూచనలు కూడా బిల్లులో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కోవడానికి ఈ బిల్లు అత్యంత అవసరమని ఆయన ఉద్ఘాటించారు. పోటో చట్టం దుర్వినియోగం జరగకుండా బిల్లులో సకల జాగ్రత్తలు వున్నాయని ఆయన చెప్పారు. ఒక వేళ ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా దుర్వనియోగం చేస్తే వారిపై కఠిన చర్య తీసుకోవడానికి అవసరమైన నిబంధనలు కూడా బిల్లులో వున్నాయని ఆయన చెప్పారు. అయితే మంత్రి వాదనను కాంగ్రెస్‌, ఎస్‌పి, బహుజన సమాజ్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్‌ రాజకీయ దురుద్దేశ్యంతోనే దీనిని ప్రవేశపెట్టారని కాంగ్రెస్‌ సభ్యుడు జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ బిల్లు మౌలిక న్యాయసూత్రాలనే కాలరాస్తున్నదని జైపాల్‌ చెప్పారు. ఈ బిల్లును తాము చివరిదాకా ప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు. అయితే బిజెపి మాత్రం ఈ సారి బిల్లును సభలో ఎలాగైనా ఆమోదింప జేస్తామని చెబుతున్నది. రాజ్యసభలో చుక్కెదురైతే సంయుక్త పార్లమెంట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి నేతలుఅంటున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+