ఎయిర్ మార్షల్ రాజీనామా
న్యూఢిల్లీః పదవోన్నతి కోసం రాజకీయంగా లాబీ నడిపే ప్రయత్నం చేసిన ఆరోపణలను ఎదుర్కుంటున్న వైమానిక దళం సీనియర్ అధికారి ఎయిర్ మార్షల్ మంజిత్ సింగ్ సెఖన్ తమ పదవికి రాజీనామా చేశారు. సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యే ముప్పు వున్న విషయం గ్రహించిన సెఖన్ తానే ముందుగా రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు. తిరువనంతపురం సదరన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వున్న సెఖన్‌ను గతవారమే ఆ పదవినుంచి తప్పించి ఢిల్లీలోని వైమానిక దళం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. వైమానిక దళం పశ్చిమ కమాండ్ చీఫ్‌గా నియామకం కోసం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్ బాదల్‌తో పైరవీ చేయించారని ఆయనపై అభియోగం వుంది.












Click it and Unblock the Notifications
