తృతీయ ప్రత్యామ్నాయానికి పిలుపు
హైదరాబాద్‌ః బిజెపి, కాంగ్రెస్‌లకు జాతీయ స్థాయిలోనూ, కాంగ్రెస్, బిజెపి-తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రస్థాయిలోనూ తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం జాతీయ సభలు పిలుపునిచ్చాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, మతతత్వ వాదం దేశాన్ని వినాశనం దిశగా తీసుకుపోతున్నాయని మహా సభల ప్రారంభం రోజు జరిగిన సభలో వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం అగ్రనేత జ్యోతిబసు అయోధ్య కేసులో సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 17వ జాతీయ మహాసభలు మంగళవారంనాడిక్క ప్రారంభమయ్యాయి. సిపిఎంసీనియర్ నేత లావు బాలగంగాధర రావు పార్టీ జెండాను ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
