సీఎం పోస్టుకు రాజీనామా-గవర్నర్ కు లేఖ..! మోడీకి థ్యాంక్స్ చెప్పిన అభిజీత్ దిప్కే..!
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింక వ్యాఖ్యల తర్వాత ఆన్ లైన్ లో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఆరంభం నుంచీ సెటైర్లు వేస్తూనే ఉంది. ఇప్పటికే సీజేపీ సెటైర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలువురు పెద్దల్ని అసహనానికి గురి చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో చిన్నారుల మరణాలపై అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యంపై వరుసగా ప్రశ్నలు సంధిస్తున్న సీజేపీ నేత అభిజీత్ దిప్కే( Abhijeet Dipke) తాజాగా బిగ్ పంచ్ విసిరారు.
మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర అనారోగ్యంతో 30 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మోహన్ యాదవ్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీన్ని సీఎం మోహన్ యాదవ్ లైట్ తీసుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఛీఫ్ అభిజీత్ దిప్కే.. తానే స్వయంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటూ, సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ కు లేఖ పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ లేఖను ఎక్స్ లో ట్వీట్ చేశారు.

I hereby resign as the Chief Minister of MP with immediate effect.
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 13, 2026
I thank Hon’ble PM @narendramodi ji for giving me the opportunity to serve the people of MP, an opportunity in which I have clearly failed.@GovernorMP pic.twitter.com/BVhfJDIf5n
30 మంది గిరిజన పిల్లలు చనిపోయాక, సీఎం పదవిలో కొనసాగేందుకు తన మనస్సాక్షి అంగీకరించడం లేదంటూ దిప్కే ఈ లేఖలో పేర్కొన్నారు. ఆ పిల్లలకు కావాల్సిన వైద్య సాయం అందించండంలో తాను విఫలమైనట్లు అంగీకరిస్తున్నట్లు కూడా తెలిపారు. ముందు ఒక్కొక్కరికీ 2 లక్షల పరిహారం ప్రకటించామని, గిరిజనుల ఒత్తిడితో దాన్ని 4 లక్షలకు పెంచామని, అలాగే తమ ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యే, మంత్రి పిల్లలు చనిపోతే ఇలాగే 4 లక్షలు సరిపోతుందని అనుకుంటామా అని తనను తాను ప్రశ్నించుకున్నట్లు దిప్కే వెల్లడించారు. ఈ మరణాలకు కనీసం వైద్యాధికారుల్ని సైతం బాధ్యుల్ని చేయలేకపోయానని తెలిపారు. మన ప్రధాని మోడీ ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్నా, నదిలో నీళ్లు తాగుతూ గిరిజనులు అనారోగ్యం పాలవుతున్నారని, బాలాఘాట్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా పరిస్ధితి ఇలాగే ఉండటం తన వైఫల్యానికి నిదర్శనం అన్నారు. కాబట్టి తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ పదవికి రాజీనామా చేస్తున్నట్లు దిప్కే ఇందులో పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
