Abhijeet Dipke: మళ్లీ కెలికిన పాడ్ కాస్టర్- వీడియోతో బదులిచ్చిన కాక్రోచ్ బాస్..!

సుప్రీం ఛీఫ్ జస్టిస్ కాక్రోచ్ వ్యాఖ్యల తర్వాత అదే పేరుతో కాక్రోచ్ జనతా పార్టీని ఆన్ లైన్ లో స్ధాపించి, నీట్ అక్రమాలకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించిన అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) డిగ్రీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. బోస్టన్ యూనివర్శిటీలో తాను చదువుకున్నట్లు, స్కాలర్ షిప్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే దిప్కే పలు ఆధారాలను షేర్ చేశారు. అయినా తాజాగా జంతర్ మంతర్ లో ఆయనతో కలిసి ఉద్యమం చేసిన సోనమ్ వాంగ్ చుక్ పాల్గొన్న ఓ పాడ్ కాస్ట్ లో పాడ్ కాస్టర్ ప్రఖర్ గుప్తా మళ్లీ ఈ వివాదాన్ని కెలికారు.

స్టాలిన్ ఓటమిపై తేల్చేసిన మద్రాస్ హైకోర్టు..! కీలక తీర్పు..!
స్టాలిన్ ఓటమిపై తేల్చేసిన మద్రాస్ హైకోర్టు..! కీలక తీర్పు..!

బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న తన స్నేహితులలో ఒకరికి, అక్కడ దీప్కే పట్టభద్రుడైనట్లు ఎటువంటి రికార్డు దొరకలేదని పాడ్‌కాస్టర్ ప్రఖర్ గుప్తా చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. తన సన్నిహిత స్నేహితులలో ఒకరు బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారని, జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనలకు మద్దతు ఇవ్వడంలో చురుకుగా పాల్గొన్నారని వెల్లడించారు. కానీ అతను దిప్కే డిగ్రీ రికార్డు కోసం వెతికితే దొరకలేదన్నారు. అతను అభిజీత్ విద్యార్హతల్ని క్షుణ్ణంగా పరిశీలించగా, అతను బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైనట్లు ఎలాంటి రికార్డు లేదని తెలిసిందన్నారు.

Abhijeet Dipke Hits Back as Podcaster Reignites Controversy Over His BU Degree
సుప్రీం సాక్షిగా కేంద్రంతో డీల్ ఓకే ..! కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..!
సుప్రీం సాక్షిగా కేంద్రంతో డీల్ ఓకే ..! కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..!

ఈ పాడ్ కాస్ట్ పై అభిజీత్ దిప్కే ఎక్స్ లో స్పందించారు. బోస్టన్ విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో తాను ఉన్నట్లుగా కనిపిస్తున్న ఒక వీడియోను ఆయన షేర్ చేశారు. బీయూ కామ్ గ్రాడ్ ఈవెంట్లకు గుప్తా స్నేహితులను ఆహ్వానించకపోవడం తన తప్పు కాదంటూ దిప్కే చురకలు అంటించారు. ఆ వీడియో BU COM గ్రాడ్ స్టూడెంట్ కౌన్సిల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పోస్ట్ చేసిన స్టోరీ స్క్రీన్ రికార్డింగ్. తద్వారా తాను చదువుకున్న రోజుల్ని దిప్కే మరోసారి గుర్తుచేసారు. మరోవైపు దీప్కే తమ గ్రాడ్యుయేట్ అని బోస్టన్ విశ్వవిద్యాలయమే స్వయంగా వెల్లడించినా పాడ్ కాస్టర్ గుప్తా ఈ ఆరోపణలు చేయడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+