భారత జట్టు సంచలనవిజయం

గౌహతిః జింబాబ్వేతో గౌహతిలో మంగళవారం నాడు జరిగిన ఐదో టెస్ట్‌మాచ్‌లో భారత జట్టు 101 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ 3-2 తేడాతో భారత్‌ కైవసమయింది.

భారత జట్టు 50 ఓవర్లలో 333 పరుగులు సాధించగా జింబాబ్వే 232 పరుగులకే ఆలాట్‌అయింది. భారత జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్‌లోనూ బౌలింగ్‌లోను జింబాబ్వే ఆటగాళ్లను మోతమోగించారు. ఓపెనర్‌గా వచ్చి కడదాకా ఆడిన మోగింయా 159 పరుగులతో, తాజా సంచలనం యువరాజ్‌ సింగ్‌ 75 పరుగులతో భారత్‌విజయానికి బాటలు వేశారు. తమ వంతుగా భారత బౌలర్లు హర్భజన్‌ సింగ్‌ మూడువికెట్లు, జహీర్‌ ఖాన్‌ 3 వికెట్లు, విజయ్‌ భరద్వాజ్‌, సౌరవ్‌ గంగూలీ చెరోవికెట్‌ సాధించారు. జింబాబ్వే జట్టుపై భారత బౌలర్లు తీవ్రమైన వత్తిడి తేగలిగారు.అయిదు వికెట్ల నష్టానికి 220 పరుగుల వద్ద వున్న జింబాబ్వే జట్టు ఆ తర్వాత పదిపరుగులకేమిగిలిన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చి ఆట ఆఖరు వరకు అజేయంగా నిలిచి 159 పరుగులు చేసిన దినేష్‌ మోంగియాకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, మాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ లభించాయి.అస్సాం ప్రభుత్వం 50 వేల రూపాయల ప్రత్యేక బహుమతిని కూడాఅందజేసింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+