ఎంపిటిసి సభ్యురాలి ఆత్మహత్య యత్నం
వరంగల్: ఎఆర్‌ఎస్‌ఐ బిక్షపతి భార్య, మామునూరు- 2 ఎంపిటిసి సభ్యురాలు సాంబారిఅరుణ (40) సోమవారం ఉదయం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న భర్త బిక్షపతి ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించాడు.
బిక్షపతి ఫిర్యాదు ప్రకారం- ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడానికి కొద్ది కాలంగా నాగేశ్వరరావు పలు రకాలుగా ప్రయత్నించాడు. దీంతోవిసిగిపోయిన అరుణ ఆత్మహత్యకు పాల్పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కమాండెంట్ వేధింపుల గురించి హోం మంత్రికి, ఉన్నతాధికారులకు చెప్పుకుంది.అయినా ఫలితం కనిపించలేదు. పైగా కమాండెంట్ వేధింపులుపెరిగాయి. వీటిని భరించలేక ప్రాణాలు
తీసుకునేందుకు సిద్ధపడింది. అయితే, అరుణ ఆరోపణలను కమాండెంట్ ఖండిస్తున్నాడు.












Click it and Unblock the Notifications
