ప్రత్యూష తల్లికి బెదిరింపులు

హైదరాబాద్‌ః వర్ధమాన నటి ప్రత్యూష కేసులో సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాల్సిందిగా హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్ట్‌మార్టం జరిపిన డాక్టర్‌ మునుస్వామి నివేదికను పరిశీలించిన త్రిసభ్య నిపుణుల కమిటీని హైకోర్టు తప్పుబట్టింది.

అసలు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన లక్ష్యం ఏమిటీ ఈ కమిటీ నిర్వహించిన పాత్ర ఏమిటని న్యాయమూర్తులు నిలదీశారు. ప్రజాతంత్ర మహిళా సంఘం నేత పుణ్యవతి, న్యాయవాది సౌభాగ్యలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ మోతిలాల్‌ నాయక్‌, జస్టిస్‌ రోహిణితో కూడిన డివిజన్‌ బెంచ్‌దర్యాప్తు జరుపుతున్న విషయం విదితమే. త్రిసభ్య కమిటీ తన పరిథిని అతిక్రమించి పోలీసుల తప్పేం లేదని నివేదికలో పేర్కొనడం పట్ల కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. త్రిసభ్య కమిటీని నియమించిన లక్ష్యం ఏమిటీ ఆ కమిటీ పోలీసులకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడమేమిటని కోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తుల ప్రశ్నల పరంపరతో ప్రభుత్వ న్యాయవాది ఉక్కిరిబిక్కిరయ్యారు. సమర్ధించుకోవడానికి ప్రయత్నించిన ప్రతీసారి కోర్టు ప్రశ్నలతో ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించడానికి త్రిసభ్య కమిటీ చూపిన ఆధారాలను కూడా కోర్టు తప్పుబట్టింది.రేప్‌ జరిగితే ఫలానా చోట్లోనే గాయాలు వుండాలని రూల్‌ వుందా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్‌ మునుస్వామి సోమవారం నాడే నిండు కోర్టులో పోస్ట్‌మార్టం సమయంలో తీసిన ఫోటోల నెగెటివ్‌లను పోలీసులు ఇంతవరకు తనకు ఇవ్వలేదని చెప్పారు. ఒరిజనల్‌ కేసుషీట్‌ కూడా ఇంతవరకు తనవద్దకు రాలేదనిఅందువల్ల తాను ఫైనల్‌ రిపోర్టు తయారు చేయలేకపోయానని ఆయన తెలిపారు. మునుస్వామి చెప్పినవిషయాలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. డాక్టర్‌ మునుస్వామి కోరిన రిపోర్టులను ఆయనకుఅందజేయాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి వివిధ పత్రికల్లో రిపోర్టులు రాసినవిలేకరులను కూడా న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్‌ నాయక్‌ ఆదేశించారు. బుధవారం నాడు కూడా కేసువిచారణ కొనసాగుతుంది.పాఠకుల ప్రతిస్పందన
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+