ప్రత్యూష తల్లికి బెదిరింపులు
(ఉండవల్లి పవన్ కుమార్)
హైదరాబాద్‌ఃనాకు గత రెండు రోజుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, భయంగా ఉంది అని ప్రత్యూష తల్లి సరోజిని దట్స్ తెలుగు డాట్ కాం కి చెప్పారు. నా డిమాండ్స్ ఇతరమైనవి ఏవీ కావు. నా డాటర్ ని ఎవరు హత్య చేసిండ్రు. అది ఫస్ట్ బయటికి రావాలి. సెకండ్-వారికి కఠినమైన శిక్ష పడాలి, అంతే... అని ఆమె చెప్పారు.
అంతకు ముందు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖర్ రావు తోఅసెంబ్లీ గెస్ట్స్ హాల్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూసరోజిని నల్గొండ జిల్లా బొమ్మల రామారంలో టీచర్. ఆమెకుథ్రెటెనింగ్ కాల్స్ వస్తున్నాయి. అవతలి వారు ఎవరో మాత్రం ఆమెకు తెలీదు. మేం కోరేది ఏంటంటే- ఆమెను భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ కిట్రాన్స్ ఫర్ చేయాలి. ఇంటి వద్ద గార్డుని పెట్టాలి.సెక్యూరిటి ఏర్పాటు చేయాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం సరోజిని అసెంబ్లీలోని తెలంగాణా రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో దాదాపు గంటసేపు కూర్చున్నారు.పాఠకుల ప్రతిస్పందన












Click it and Unblock the Notifications
