మందిర్‌ సాక్షిగా ప్రేమ జంట ఆత్మహత్య

హైదరాబాద్‌:పెద్దలు తమను విడదీస్తారనే భయంతో ఓ ప్రేమ జంట సోమవారం హైదరాబాద్‌లోని బిర్లా మందిర్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బిర్లా మందిర్‌లో వృద్ధులు,వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ పైనుంచి కిందకు దూకి ఈ ప్రేమికులు ప్రాణాలు విడిచారు. ఒకరు ఆంజనేయస్వామి వద్ద ప్రాణాలు వదలగా మరొకరు శివ మందిరం వద్ద తుదిశ్వాస విడిచారు.

ఆల్వాల్‌ వెస్ట్‌ వెంకటాపురానికి చెందినకె.సి. పద్మారావు కూతురు ప్రియదర్శిని (21) రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోనిఆర్‌.ఆర్‌.ఎం. కళాశాలలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదువుతోంది. కృష్ణా జిల్లా కొండూరు మండలం పొలిశెట్టి పాగు గ్రామ నివాసి చంద్రశేఖర్‌ (27) కొంత కాలం క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్‌ చేరుకున్నాడు.వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి ఎవరికీ చెప్పకుండా చంద్రశేఖర్‌ గ్రామానికి పారిపోయారు.విషయం తెలుసుకున్న ప్రియదర్శిని తలిదండ్రులు వారిద్దరిని శనివారం నగరానికి తీసుకువచ్చారు. అమ్మాయి చదువుఅయిపోయిన తర్వాత పెళ్లి చేస్తామని అంత వరకు ఓపిక పట్టాలనికోరారు. అయితే ఆ మాటల్లోని నిజాయితీని శంకించిన వారిద్దరు మరో సారి పారిపోవాలనుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు బిర్లా మందిర్‌ చేరుకున్నారు. బిర్లా మందిర్‌కు రమ్మంటూ తమస్నేహితులు ప్రవీణ్‌, వంశీలకు ఫోన్‌ చేశారు. వారు వచ్చిన తర్వాత ఏం చేయాలనేవిషయంపై నలుగురు మాట్లాడుకున్నారు. పెద్దలు చెప్పినట్లు కొంత కాలం ఆగితే మంచిదనిస్నేహితులు చెప్పారు.

ప్రియదర్శిని అంగీకరించినా చంద్రశేఖర్‌ ఒప్పుకోలేదు. తర్వాత తాము ఏకాంతంగా పది నిమిషాలు మాట్లాడుకుంటామని చెప్పడంతోస్నేహితులు దూరంగా వెళ్లిపోయారు. కొద్ది సేపటికి తిరిగి వచ్చారు. అయితే తమకు మరి కొంత సమయం కావాలని ప్రేమికులు అడిగారు. మళ్లీ వాళ్లు దూరంగా వెళ్లిపోయారు. అలా వెళ్లిన కొద్దిసేపటికే శివాలయం వద్ద పెద్ద శబ్దం వినిపించింది. వారు పరుగెత్తుకొచ్చే సరికి మందిర్‌లిఫ్ట్‌కు వెళ్లే వంతెన మీది నుంచి ప్రియదర్శిని కిందికి దూకి ప్రాణాలు విడిచింది. చంద్రశేఖర్‌ కిందకు దూకుతూ కనిపించాడు. అక్కడున్న ప్రజలు వద్దని వారించినా వినకుండాపైన అటూ ఇటూ పరుగెత్తి కిందికి దూకేశాడు. చంద్రశేఖర్‌ 45 నిమిషాల పాటుఅపస్మారక స్థితిలో వున్నాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+