ప్రత్యూషకేసు: సిబిఐ దర్యాప్తు మొదలు
హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష కేసులో తాము దర్యాప్తు ప్రారంభించినట్లు సిబిఐ బుధవారం కోర్టుకు తెలియజేసింది. ఈ కేసు దర్యాప్తును వెంటనే చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
అవసరమైతే ప్రత్యూష కేసుపై న్యాయవిచారణకు ఆదేశిస్తామని బెంచీ న్యాయమూర్తుల్లోఒకరైన మోతీలాల్ నాయక్ చెప్పారు. పోలీసులు అడగకపోవడం వల్లనే ప్రత్యూష బట్టలను వారికి ఇవ్వలేదని కేర్ ఆస్పత్రి ప్రతినిధులు బుధవారం కోర్టుకు చెప్పుకున్నారు. ప్రత్యూష దేహానికి చికిత్సలో భాగంగానే గాయాలుఅయినట్లు త్రిసభ్య కమిటీ కోర్టుకు తెలియజేసింది.












Click it and Unblock the Notifications
