మేమే షరతులు పెడుతున్నాం: బుద్ధదేవ్‌

హైదరాబాద్‌: ప్రపంచ బ్యాంక్‌కు తామే షరతులు విధిస్తున్నామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య అన్నారు. ఆయనమీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడారు. తాము ప్రపంచ బ్యాంక్‌ షరతులను తాము ఆమోదించడం లేదని, తామే ప్రపంచ బ్యాంక్‌కు షరతులు పెడుతున్నామని ఆయన అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బ్యాంక్‌ షరతులువికటిస్తున్నాయని, ప్రపంచ బ్యాంక్‌ తమ విధానాలను నిర్దేశించాలనుకుంటే ఊరుకోమని ఆయన అన్నారు. రైతుల, కార్మికుల, ఉద్యోగుల మద్దతు వల్లనే తామే పశ్చిమ బెంగాల్‌లో వరుసగావిజయాలు సాధిస్తూ వస్తున్నామని ఆయన చెప్పారు.

తాము మైనారిటీ మతతత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని, అయితే మెజారిటీ మతతత్వం ప్రధాన సమస్యగా పరిణమించిందని ఆయన అన్నారు. మదర్సాలలో ఇంగ్లీష్‌, గణితం వంటి సబ్జెక్టులు బోధించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లో ప్రయివేట్‌ రంగంలో వృత్తి కళాశాలల అనుమతిపై
ప్రశ్నించినప్పుడు ఉన్నత విద్యారంగంలో మాత్రమే ప్రయివేట్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని ఆయన జవాబిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+