పాక్ చొరబాట్లను ఆపాలి: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: భారత్‌లోకి తీవ్రవాదులను ప్రవేశ పెట్టడం మానుకోవాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు. సరిహద్దు వెంబడి పరిస్థితి అంత చెడ్డగా లేదని ఆయన అన్నారు.
ఇరు వైపులా సైనికులు మోహరించి ఉన్న ఈ సందర్భంలో సరిహద్దుల వెంబడి పరిస్థితిపై ప్రశ్నించగా-ఉద్రిక్తత ఉంది. పరిస్థితి మునుపటంత చెడ్డగా లేదు అని ఆయన జవాబిచ్చారు.
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ శనివారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై వ్యాఖ్యానించడానికి వాజ్‌పేయి నిరాకరించారు. తాను ముషారఫ్ ప్రసంగ పాఠం చూడలేదని,అందువల్ల ముషారఫ్ ప్రసంగంపై వ్యాఖ్యానించడం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
