హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వ పగ్గాలు తిరిగి హరికిషన్ సింగ్ సూర్జిత్‌కే దక్కాయి. ఆయన మూడేళ్ల కోసం మరోసారి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
యువతకు ఈ సారి నాయకత్వ అవకాశం దక్కవచ్చుననే ఊహాగానాలకు తెర దించుతూ హరికిషన్ సింగ్‌నే తిరిగి ప్రధాన కార్యదర్శిగా ప్రతినిధులు ఎన్నుకున్నారు. సిపిఎం 17వ మహా జాతీయ మహాసభల్లో తిరిగి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పొలిట్ బ్యూరోలో రాష్ట్రానికి చెందిన కొరటాల సత్యనారాయణకు స్థానం లభించింది. ఇదొక్కటే మార్పు కేంద్ర కమిటీవిషయంలో జరిగింది. 15 మందితో కూడిన పోలిట్ బ్యూరోలో జ్యోతిబసు, ప్రకాశ్ కరత్,సీతారాం ఏచూరి ఉన్నారు. 77 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.