ఇద్దరు మిలిటెంట్లు, ముగ్గురు పోలీసులు మృతి
జమ్మూ: జమ్మూ డివిజన్‌లో శనివారం రాత్రి నుంచి జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరుమిలిటెంట్లు, ముగ్గురు పోలీసులు మరణించారు. ట్రాన్సిస్టర్ బాంబు పేలుడు సంఘటనలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.
రాజౌరి జిల్లా కాలకోట్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు, ఒక లష్కర్-ఎ- తోయిబామిలిటెంట్ మరణించారు. ఇద్దరు భద్రతాధికారులు గాయపడ్డారు. మరణించిన లష్కర్‌మిలిటెంట్‌ను అబు అమూ అలియాస్ అబ్దుల్ సిత్తార్‌గా గుర్తించారు.
ఉద్ధంపూర్ జిల్లా తగన్ గ్రామంలో ట్రాన్సిస్టర్ బాంబుపేలి ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. పొలంలో పడి ఉన్న ట్రాన్సిస్టర్‌ను చూసిన పిల్లలు దాన్ని విడదీయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో ఈ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications
